కలం, ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణంలోని పీఆర్‌టీయూ భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (CITU) ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌కు చెందిన సుమారు 40 మంది టైల్స్ కార్మికులు భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ లేబర్ కార్డులు మంజూరు చేయాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఖానాపూర్ టైల్స్ యూనియన్ అధ్యక్షుడు మల్లేష్, ఉపాధ్యక్షులు అభిత్, ముకేశ్, రాజు, కార్మికులు పాల్గొన్నారు.

