కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 10 ఫ్లైట్లు (Flight) రద్దయ్యాయి. శుక్రవారం పొగమంచు దట్టంగా ఉండటంతో 10 ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డీజీసీఏ. పాట్నా, ఇండోర్, వారణాసి, కొచ్చి, కోల్ కతా, కోయంబత్తూర్, బెంగుళూరు, విశాఖ, ముంబైకు వెళ్లే ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డీజీసీఏ. పొగమంచు దట్టంగా ఉండటంతో ఫ్లైట్ల (Flight) రాకపోకలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అటు బెంగుళూరు-హైదరాబాద్ హైవే మీద భారీగా పొగమంచు కమ్మేసింది. ఈ హైవీ మీద నాలుగు లారీలు ఢీకొన్నాయి. అటు శంషాబాద్ నుంచి పాలమూరుకు వెళ్లే హైవీ మీద కూడా 10 కి.మీ దాకా ట్రాఫిక్ జామ్ అయింది.


