లక్ష్మీ భాస్కర్‌పై వేటు.. నిమ్స్ డైరెక్టర్ కీలక ఉత్తర్వులు

కలం, వెబ్ డెస్క్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్ (Lakshmi Bhaskar) ని సస్పెండ్ చేస్తూ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ భాస్కర్ ను సెప్టెంబర్ 22న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

ఆయన కస్టడీ కాలం 48 గంటలు దాటడంతో, సివిల్ సర్వీసెస్ రూల్స్, నిమ్స్ నిబంధనల ప్రకారం అరెస్ట్ అయిన తేదీ (సెప్టెంబర్ 22, 2026) నుంచే సస్పెన్షన్ అమల్లోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనల మేరకు నిమ్స్ డైరెక్టర్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. సస్పెన్షన్ కాలంలో నిబంధనల ప్రకారం ఆయనకు సబ్సిస్టెన్స్ అలవెన్స్ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>