సీఎంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ.. రేవంత్ కీలక సూచనలు!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth) మార్యాదపూర్వకంగా కలిశారు. తమను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ అవకాశం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని అభ్యర్థులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, విస్తృత ప్రచారం నిర్వహించడం, పట్టభద్రులతో మమేకమవడం వంటి అంశాలపై వారికి సీఎం పలు సూచనలు చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>