కలం, వెబ్ డెస్క్ : తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ దరఖాస్తును గత మూడు నెలలుగా పెండింగ్‌లో పెట్టడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆగ్రహం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందర నుంచి ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లను ప్రశ్నించారు.
తన పాస్‌పోర్ట్ ఇవ్వకుండా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం లేదా విదేశాంగ శాఖ ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా అని కేఏ పాల్ (KA Paul) నిలదీశారు. తాను భారతదేశానికి తిరిగి వస్తున్నాననే భయంతోనా, లేక ఎఫ్సిఆర్ఏ (FCRA) అంశాల వల్ల ఈ ఆలస్యం జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాను గొంతు విప్పితే అనవసరమైన సమస్యలు ఎదురవుతాయని, వెంటనే తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ (Passport Renewal) చేసి అందజేయాలని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
Also Read : పాత బియ్యం.. కొత్త బ్రాండ్లు :కరీంనగర్లో ‘రేషన్’ మాయాజాలం!
Follow Us On: X(Twitter)

