కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండలం గట్టుగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన మంగళగిరి శ్రీను అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

