తస్మాత్ జాగ్రత్త.. నగరంలో నకిలీ వైద్యులు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఎలాంటి వైద్య అర్హతలు, అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న నలుగురు నకిలీ వైద్యుల (Fake Doctors)ను మల్కాజిగిరి ఎస్‌వోటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర, జవహర్‌నగర్, గోపాలపురం, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలు (ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు), క్లినిక్‌ల పేరిట వీరు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.

తనిఖీల సమయంలో ఆయా కేంద్రాల్లో ఉన్న వైద్య పరికరాలు, అక్రమ మందులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>