కలం, నిర్మల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడని బీజేపీ ఓబీసీ మోర్చా నిర్మల్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదాసు స్వామి యాదవ్ అన్నారు. నిర్మల్ బీజేపీ (Nirmal BJP) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ లోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ – 2047 లక్ష్యంతో మోదీ దేశ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలుగా దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బడి పోతన్న, రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు మెడిసిమ్మె రాజు, గంగయ్య, మల్లేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

