కలం, నిర్మల్ : ప్రముఖ తెలంగాణ తల్లి రూపశిల్పి, నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాద్రిపేట్ కు చెందిన బైరోజు వెంకట రమణాచారి (Venkata Ramanachari) ని జిల్లా కవులు, రచయితలు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితల విభాగాల్లో ప్రకటించిన ప్రతిభా పురస్కారాల్లో వెంకటరమణాచారి ఎంపికయ్యారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ చేతుల మీదుగా ఆయన పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. వెంకటరమణాచారికి ప్రతిభా పురస్కారం దక్కడం నిర్మల్ జిల్లాకే గర్వకారణమని కవులు పత్తి శివప్రసాద్, నేరెళ్ల హన్మంతు, పోలీస్ భీమేష్, రాజేందర్ తదితరులు ఆయనను అభినందించారు.

