బాధితులకు తక్షణ న్యాయం.. ఎస్పీ కీలక ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో: బాధితులకు తక్షణ న్యాయం అందేలా భరోసా కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు. గుండాల పోలీస్ స్టేషన్‌లో (Gundala Police Station) వార్షిక తనిఖీ నిర్వహించి రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీటీఎన్‌ఎస్ 2.0లో కేసుల వివరాలను సకాలంలో నమోదు చేయాలని, సిబ్బంది వెబ్ అప్లికేషన్లపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

గుండాల పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్, గార్డ్ పోస్ట్ మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీల్లో సీఐలు తిరుపతి, సత్యనారాయణ, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>