కలం, యాదగిరిగుట్ట : బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని గౌరాయిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా ‘అంగన్ మిలన్’ కార్యక్రమం (Angan Milan Programme) చేపట్టారు. చిన్నారుల పోషకాహారం కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ సన్మానించి, బహుమతులు అందజేశారు.
పోషకాహార సంబంధించిన అంశాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థానికంగా లభించే పౌష్టిక ఆహారం, పప్పులు, పచ్చ కూరగాయల ప్రదర్శనలు ఏర్పాటు చేసి సమతుల్య ఆహారంపై కుటుంబాలకు, మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం చిన్న పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నాయా..? లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారులందరికీ నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో అందించాలని, కేంద్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా చూసుకోవాలని అశోక్ గౌడ్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమం((Angan Milan Programme))లో స్థానిక బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గుంటిపల్లి సత్యనారాయణ, నల్ల పోశెట్టి, భోగ ఉదయ్, భోగ విష్ణు, బాలరాజు, రాజు, కార్యకర్తలు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also Read : నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ మాస్ వార్నింగ్
Follow Us On : WhatsApp

