సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ రగడ .. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్‌పూర్(Sultanpur) జేఎన్టీయూ (JNTU) ఇంజినీరింగ్ క్యాంపస్‌లో ర్యాగింగ్ (Ragging) ఘటన తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం సెకండ్ ఇయర్ ఈఈఈ (EEE) చదువుతున్న రుత్విక్ అనే విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు తీవ్రస్థాయిలో ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయమై బాధిత విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం విద్యార్థులందరూ ఒక్కటై క్యాంపస్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

అనంతరం విద్యార్థులు 161వ జాతీయ రహదారిపైకి చేరుకుని ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు రక్షణ కల్పించడంలో విఫలమైన కళాశాల యాజమాన్యం జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులపై జేఎన్టీయూ సుల్తాన్‌పూర్ (Sultanpur) యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది.

Also Read : కేటీఆర్‌.. కేసీఆర్ కొడుకు కాకపోతే రాజకీయ ఉనికి లేదు: అద్దంకి దయాకర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>