కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి ఆయన వియ్యంకుడు ఉదారత చాటారు. ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామాల హైస్కూళ్లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) సౌజన్యంతో తన వియ్యంకుడు పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో సమకూరిన 1,80,000 చొప్పున విలువైన సైన్స్ ల్యాబ్ మెటీరియల్‌ను వేల్పూర్ నివాసంలో ఆయా పాఠశాలలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ల్యాబ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) పేర్కొన్నారు. అలాగే భీంగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు 1,46,650 విలువైన 35 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.
విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వియ్యంకులు దయానంద రెడ్డి(Enugu Dayananda Reddy) ముందుకు రావడం అభినందనీయమని, విద్యా రంగానికి అయన అందిస్తున్న సహకారం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ఇకముందు కూడా అవసరం ఉన్న చోట మాసహాయ సహాకారాలు ఉంటాయని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటు చేపూర్ పాఠశాలకు 50 వేలు విలువగల 10 డ్యూయల్ డెస్క్ బెంచిలను వేల్పూర్‌లోని నివాసంలో పాఠశాల యాజమాన్యానికి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
Also Read : నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ మాస్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

