కలం, వెబ్ డెస్క్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) సానా తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చికిరి చికిరి అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లింది. సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది.
మరి.. సెకండ్ సింగిల్ అప్ డేట్ ఏంటంటే.. జనవరి 1న రిలీజ్ చేయాలి అనుకున్నారట మేకర్స్. అయితే.. జనవరి 1న రిలీజ్ చేయడం కంటే.. సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని.. రీచ్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్లాన్ మార్చారని తెలిసింది. ఈసారి చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లపై చిత్రీకరించిన సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక పెద్ది షూటింగ్ అప్ డేట్ ఏంటంటే.. జనవరి ఎండింగ్‌కి టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుందట. ఫిబ్రవరి ఎండింగ్ కి సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారని సమాచారం. ఫిబ్రవరి నుంచి ప్రమోషన్స్‌లో స్పీడు పెంచనున్నారు.
ఈ భారీ పాన్ ఇండియా మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమా పై బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని మెగా అభిమానులే కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మరి.. పెద్ది పెద్ద విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Read Also: రాజాసాబ్ రన్‌టైంపై మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
Follow Us On: Youtube


