epaper
Monday, March 2, 2026
epaper

వల్లభనేని వంశీకి ఊరట: హైకోర్టు కీలక ఆదేశం

కలం, వెబ్ డెస్క్​ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో ఆయనకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీతో పాటు మరికొందరిపై మాచవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన వల్లభనేని వంశీ, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు బనాయించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరుపక్షాల వాదనలను విన్నది. అనంతరం వంశీని ప్రస్తుతానికి అరెస్ట్ చేయవద్దని పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi

Read Also: శ్రేయ గ్రూప్​ ఆస్తుల జప్తు.. సంస్థపై ప్రభుత్వ చర్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!