కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలంలో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. 107 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు మండలంలోని గణేష్ పాడు సమీపంలోని కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు బోల్తా పడటంతో దీంతో 20 మంది స్టూడెంట్లకు గాయాలయ్యాయి. కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్టూడెంట్లను బయటకు తీశారు. గాయపడ్డ స్టూడెంట్లను హాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులో స్కూల్ బస్సు బోల్తా.
ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు.. 20 మందికి గాయాలు
School Bus Accident in Penuballi, Khammam; 20 Students Seriously Injured #Khammam #SchoolBusAccident #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/jM8NIku55x— Kalam Daily (@kalamtelugu) January 2, 2026
Read Also: మనం చీరలు కడుతాం.. మనది గొప్ప కల్చర్ : నటి రోహిణి
Follow Us On: Sharechat


