కలం,వెబ్ డెస్క్: దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జన నాయకుడు” (Jana Nayakudu) హెచ్ .వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ సినిమా తమిళ వెర్షన్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15 కోట్లు వచ్చినట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా ‘జన నాయకుడు’సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇది తెలుగులో సూపర్ హిట్ అయిన ‘భగవంత్ కేసరి’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ‘జన నాయకుడు’ మూవీ మేకర్స్ మాత్రం ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ హెచ్. వినోద్ ఈ ప్రచారంపై స్పందించారు. నేను ఈ విషయాన్ని కన్‌ఫార్మమ్ చేయను. అలాగే కొట్టిపారేయను. తాను గతంలో చెప్పినట్లుగానే ఇది పూర్తిగా దళపతి సినిమా. ఈ సినిమా కథకు సంబంధించి ప్రేక్షకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ ను జనవరి 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. “జన నాయకుడు” (Jana Nayakudu) ట్రైలర్ బట్టి ఆ సినిమా కథపై ఓ క్లారిటీ వస్తుంది.
Read Also: పెద్ది సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Follow Us On: Instagram


