18 ఏళ్లు నిండిన వారికే సోషల్ మీడియా..!

కలం, వెబ్ డెస్క్ : సామాజిక మాధ్యమాల (Social Media) ఉపయోగంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాలు నిండిన వారికే సోషల్ మీడియా వాడేందుకు అనుమతి ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్‌లను క్రియేట్ చేసుకునేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధనను పరిశీలించాలని సుప్రీంకోర్టు (Supreme Court ) సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

18 ఏళ్లలోపు వారు స్వతంత్రంగా ఒప్పందాలు చేసుకోవడానికి గల చట్టపరమైన అర్హతతో సహా, మైనర్లకు సంబంధించిన భారతీయ చట్టాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు , ఇతర డిజిటల్ మధ్యవర్తులు పాటించేలా ఒక శాసనాత్మక చట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది.

సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను (Social Media Accounts) వినియోగించుకునే పిల్లలకు రక్షణ కల్పించాలని కోరుతూ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ (JRCA) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని, జస్టిస్ జయమాల్య బాగ్చి మరియు జస్టిస్ వి. మోహనలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధన కేవలం ఒక మార్గదర్శకంగా మిగిలిపోకూడదని, మధ్యవర్తుల నియమాల కింద దీనికి ఒక చట్టం రూపంలో తీసుకురావాలని జస్టిస్ బాగ్చి కేంద్రాన్ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>