‘సర్’ ప్రక్రియపై లాయర్ల అగ్రహం.. భద్రాద్రి కొత్తగూడెంలో “ఐలు” ఆందోళన!

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ పేరుతో చేపడుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదుట ఐలు ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా (AILU Protest) నిర్వహించారు. ఎన్నికల సంఘం ఏకపక్ష, అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో పార్లమెంట్‌లో తీర్మానం చేసి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.

​ఐలు జిల్లా కోర్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె. పురుషోత్తం రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు జే. శివరాం ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పి. కిషన్ రావు, గౌరవాధ్యక్షుడు కె. పుల్లయ్య పాల్గొని మాట్లాడారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును ‘సర్’ నెపంతో దాదాపు 13 కోట్ల మంది నుంచి తొలగించడం దారుణమన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో వేలాది ఓట్లను తొలగించడం వల్లే అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఓటమి పాలయ్యాయని, ఈ విషయంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాగా ​ఈ ఆందోళనకు బిఆర్ఎస్, కాంగ్రెస్ లీగల్ సెల్స్ పూర్తి మద్దతు ప్రకటించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>