కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశ విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి (Bhagat Singh Jayanti) వేడుకలను కరీంనగర్ బార్ అసోసియేషన్ (Karimnagar Bar Association) ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. చిన్నతనంలోనే స్వాతంత్ర పోరాటలకు ఆకర్షితుడై బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీశాలి అని కొనియాడారు.
జయంతి వేడుకల కార్యక్రమంలో న్యాయవాదులు కుసుంబ కృష్ణారావ్, శ్రవణ్ కుమార్, మహేందర్ రెడ్డి, బీమా సాహెబ్, జనరల్ సెక్రెటరీ సీహెచ్ కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సుంకె దేవకిషన్, సాంస్కృతిక, క్రీడల కార్యదర్శి బెజ్జెంకి శ్రీకాంత్, సీనియర్ ఈసీ చెల్లోజు భూమాచారి, మదన్ మోహన్, అనురాద, జూనియర్ ఈసీ శాంతి కుమార్లతో పాటుగా సీనియర్, జూనియర్ మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.
Also Read : గుజరాత్లో గేమ్స్ జాతర.. 76 లక్షల రిజిస్ట్రేషన్లు!
Follow Us On: X(Twitter)

