ఏసీబీకి చిక్కిన నాంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

కలం, మునుగోడు: నల్లగొండ జిల్లా నాంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాళ్లబండి గోపరాజు (RI Goparaju) లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఒక వ్యక్తి తన వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆర్‌ఐ గోపరాజును కోరారు. ఇందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. ఆర్ఐ గోపరాజు సూచనల మేరకు ప్రైవేట్ అసిస్టెంట్ ఏదుళ్ల యాదగిరి బాధితుడి నుంచి నాంపల్లిలో రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఇద్దరిపై కేసులు నమోదు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచడానికి తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని సంప్రదించాలని డీఎస్పీ జగదీష్ చందర్ విజ్ఞప్తి చేశారు.

Also Read : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఐటీ దాడులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>