సీఈసీని బర్తరఫ్ చేసే వరకు జెన్ జీ తరహాలో పోరాటం: మేడిపల్లి సత్యం

కలం, కరీంనగర్ బ్యూరో: ఓట్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి భారీ ర్యాలీ (Congress Protest) నిర్వహించారు. ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ ఎదుట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వెలిచాల రాజేందర్ రావు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్, ఒడితేల ప్రణవ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను బర్తరఫ్ చేసే వరకు జెన్ జీ తరహాలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఇద్దరు కమిషనర్లు 14 సార్లు వ్యతిరేకించినా ఖాతరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేపడుతుందని స్పష్టం చేశారు.

నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ ఓట్లను అక్రమంగా తొలగించి ఓటు చోరీకి పాల్పడ్డారని, దీనిపై రాహుల్ గాంధీ ముందుగానే హెచ్చరించారని గుర్తుచేశారు. ఓట్ల చౌర్యాన్ని అరికట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, CEC జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, ఈ ఓట్ల కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మోడీ, అమిత్ షాలు రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>