బార్ లైసెన్స్ కావాలా?.. కల్లూరు మున్సిపాలిటీలో దరఖాస్తులు ప్రారంభం!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కల్లూరు (Kallur) మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా బార్ ఏర్పాటు చేయాలనుకునే వారికి తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడ ఒక ‘2బి’ బార్ (2B Bar Licence) ఏర్పాటుకు సంబంధించి ప్రియర్ క్లియరెన్స్ మంజూరు కోసం అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్. జానయ్య సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉత్తర్వుల మేరకు, తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ 2005 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు దరఖాస్తు రుసుము కింద రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 12వ తేదీ లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఖమ్మంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో గానీ, ఖమ్మం ఉప కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో గానీ. హైదరాబాద్‌లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో గానీ అందజేయవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తు విధానం, నిబంధనలు, ఇతర పూర్తి వివరాల కోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.in ను చూడవచ్చని ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య పేర్కొన్నారు.

Also Read : SIR గో బ్యాక్ నినాదంతో ఉద్యమిస్తాం : సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>