కలం, మెదక్ బ్యూరో : లంచం డిమాండ్ చేసిన ఓ పోలీస్ అధికారి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు (Kolluru) పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేశ్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 17న పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఒక లారీని కొల్లూరు పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసు నుంచి లారీని విడిపించి, యజమానిని కేసు నుంచి తప్పించడానికి ఎస్ఐ రమేశ్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు.
ఎస్ఐ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం కొల్లూరు (Kolluru) పోలీస్ స్టేషన్‌లోనే బాధితుడి నుంచి ఎస్ఐ రమేశ్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఆయన నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయనకు సంబంధించిన ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు. స్టేషన్ లోనే ఎస్ఐ పట్టు బడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read Also: హాల్ టికెట్లపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
Follow Us On: X(Twitter)


