మన్మోహన్ సింగ్.. దేశానికే దార్శనికుడు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) దేశం గర్వించదగ్గ దార్శనికుడు, జాతిరత్నం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తన మేధస్సును పూర్తిగా దేశానికే అంకితం చేసిన నిస్వార్థ నాయకుడన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని గుర్తు చేశారు. ఆ విధానాలతో హైదరాబాద్ కూడా లాభపడిందన్నారు.

మన్మోహన్ సింగ్ తెచ్చిన విధానాల కారణంగానే హైదరాబాద్ నగరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కొత్త ప్రాంతాలు ఏర్పాటైనట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అందుకే ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలనే విప్రో సర్కిల్ వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిపాలనలో మన్మోహన్ సింగ్ నిర్ణయాలు తీసుకున్నవి చాలా గొప్ప నిర్ణయాలని.. వాటి విలువ ఇప్పుడు తెలుస్తోందన్నారు.

తెలంగాణ బిల్లుపై సంతకం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లుపై మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో సంతకం చేశారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు. నెహ్రూ–పటేల్ తరువాత మన్మోహన్ సింగ్–సోనియా గాంధీ హయాంలో దేశంలో గొప్ప మార్పులు సంభవించినట్లు తెలిపారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో మన్మోహన్‌ విధానాలే కారణమన్నారు. ఆయన్ను గౌరవించుకోవడమంటే.. దేశమే తనను తాను గౌరవించుకున్నట్లు వివరించారు.

ప్రతి పేదవాడికి పని ఉండాలని ఉపాధి హామీ పథకాన్నిమన్మోహన్ సింగ్ అమల్లోకి తెచ్చారని సీఎం రేవంత్ కొనియాడారు. ఆహార భద్రత పథకం, ప్రతి పిల్లవాడికి చదువు అందాలని విద్యా హక్కు చట్టం, పాలనలో జవాబుదారీ తనం కోసం సమాచార హక్కు చట్టం వంటి విప్లవాత్మక చట్టాలు తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్‌ను ఇంకా భారతరత్న వంటి అత్యున్నత పురస్కారంతో సత్కరించకపోవడం బాధాకరమని.. కేంద్రానికి ఉన్న అభ్యంతరమేంటీ అని ప్రశ్నించారు.

Also Read : ఎన్నో మూవీస్ చేశా.. ఇలా జరగడం మొదటిసారి: నాని

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>