కలం, వెబ్ డెస్క్: తాను ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘ది ప్యారడైజ్(The Paradise)’కి వచ్చిన స్పందన చాలా ప్రత్యేకమని హీరో నాని (Actor Nani) అన్నారు. సాధారణంగా చాలా మూవీస్ రిలీజ్ అయిన రోజు ఉదయం పాజిటివ్ టాక్, సాయంత్రానికి నెగిటివ్ టాక్ తెచ్చుకుంటాయన్నారు. కానీ ది ప్యారడైజ్ మాత్రం దీనికి పూర్తి భిన్నమని.. ప్రీమియర్ షో, రిలీజ్ రోజు ఒకరకంగా స్పందన ఉందని.. షో లు పెరుగుతున్న కొద్ది పాజిటివ్ స్పందన వస్తోందన్నారు.
కొత్తగా మూవీ తీస్తున్నామని తెలుసు కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఇంత కొత్తగా ఉంటుందని ఊహించలేదని నాని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా జరగడం తన కెరీర్లో ఇదే మొదటిసారి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలాగా భావించి, సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఎంతో మంది కష్టపడి పనిచేశారని ప్రశంసించారు.
కేసీఆర్ పాత్రకు మంచి స్పందన..
ప్రియదర్శి నటించిన కేసీఆర్ పాత్రకు ఎంతో స్పందన వస్తోందని హీరో నాని (Actor Nani) తెలిపారు. మోహన్ బాబుతో నటించడం మర్చిపోలేని అనుభూతి అన్నారు. షికంజా మాలిక్ లాంటి క్యారెక్టర్ ఆయన తప్ప ఎవరూ చేయలేరన్నారు. ‘ది ప్యారడైజ్’కు హీరో తానే అయినప్పటికీ.. తన కంటే హీరో మోహన్ బాబు అన్నారు. శ్రీకాంత్ ఓదెల తాను ఏదైతే నమ్మాడో అదే తీశాడని.. వంద శాతం కష్టపడి పనిచేశాడన్నారు. సంపూర్ణేష్ బాబుతో మాట్లాడితే ఇంత మంచోళ్లు ఉంటారా.. అని అనిపిస్తుంటుందన్నారు. ది ప్యారడైజ్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : జపాన్‌కు షాక్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్!
Follow Us On : WhatsApp

