కలం, స్పోర్ట్స్: భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నుంచి భారీ మద్దతు లభించింది. గిల్‌కు జట్టును ఎక్కువ కాలం నడిపించే సామర్థ్యం ఉందని కోహ్లీ చెప్పాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు జియోస్టార్‌తో మాట్లాడిన కోహ్లీ.. గిల్ నాయకత్వంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గిల్ ఇంకా కెప్టెన్సీలో నేర్చుకుంటున్న దశలోనే ఉన్నాడని కోహ్లీ తెలిపాడు.
అయితే అతనికి సరైన ఆలోచనా విధానం, అవసరమైన దూకుడు ఉన్నాయని చెప్పాడు. ఫీల్డింగ్‌లో వ్యూహాలు రూపొందించడంపై గిల్‌కు స్పష్టత ఉందని పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో గిల్ (Shubman Gill) మరింత అనుభవం సంపాదిస్తాడని కోహ్లీ తెలిపాడు. బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెట్టాలో ఆలోచించడం, విభిన్న ఫీల్డింగ్ సెటప్‌లు పెట్టడం, బౌలర్లతో సరైన ప్రణాళికలు అమలు చేయడంలో గిల్ ముందుంటున్నాడని చెప్పాడు.
ఇక తన బ్యాటింగ్‌లో వచ్చిన మార్పు గురించి కూడా కోహ్లీ (Virat Kohli) వివరించాడు. గతంలో జట్టును నిలబెట్టే బాధ్యత తనపై ఉందని భావించేవాడినని చెప్పాడు. ఇప్పుడు మాత్రం మరింత స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ప్రేక్షకుల అంచనాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన ఆటను పూర్తిగా వ్యక్తం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు.
క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత అదనంగా 30-40 పరుగులు చేయగలిగితే జట్టుకు పెద్ద ప్రయోజనం ఉంటుందని కోహ్లీ భావిస్తున్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు బ్యాటింగ్ వేగాన్ని పెంచాలని చూస్తున్నట్లు తెలిపాడు. పరిస్థితులు అనుకూలిస్తే భారత్ 350-360 పరుగుల స్కోరు సాధించే స్థాయిలో ఉందని కోహ్లీ చెప్పాడు. తాను ఎక్కువసేపు క్రీజులో ఉంటే చివర్‌లొ మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంటుందని వివరించాడు.
Also Read : సింధు దూకుడు.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది!
Follow Us On: X(Twitter)

