కలం, వనపర్తి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఈ నెల 28వ తేదీన వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు పెద్దమందడి మండలం వెల్టూర్ సమీపంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం వనపర్తి మండలం చిట్యాల గ్రామ పరిధిలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10.30 గంటలకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

