ఆ సినిమాకు వెళ్లబోతున్న కేటీఆర్.. పోస్ట్ వైరల్!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  ‘ది ప్యారడైజ్’ మూవీ చూడబోతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పెట్టిన పోస్ట్ వైరలవుతోంది.’ చాలా సంవత్సరాల తరువాత ఈ రోజు రాత్రి సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లబోతున్నాను. నా అభిమాన నటుడు నాని, ఎంతో ప్రతిభ ఉన్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ మూవీని చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను’ అని పోస్ట్ చేశారు. అయితే ఏ థియేటర్‌కు వెళ్లబోతున్నానేది మాత్రం అందులో తెలపలేదు. దీంతో నెటిజన్లు.. ఎక్కడో చెబితే తాము కూడా వస్తామని.. మీతో కలిసి సినిమా చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెళ్లొచ్చాక తప్పకుండా రివ్యూ ఇవ్వాలి.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కడా తగ్గని ‘ది ప్యారడైజ్’..

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ది ప్యారడైజ్(The Paradise)’ థియేటర్లలో విడుదలై.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్లలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రెస్ మీట్ నిర్వహించి.. సినిమా విజయంపై స్పందించబోతున్నారు. కెరీర్లో మొదటిసారి ఊర మాస్ పాత్రలో కనిపించిన నాని నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Also Read : అర్హులైన ప్రతి పేదవారికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం: మంత్రి పొంగులేటి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>