పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, పెంబి: నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలం మందపల్లి గ్రామానికి చెందిన దేశవేణి లక్ష్మి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

వారు నూతన ఇంటిలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>