ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు!: ఎంపీ రఘునందన్ ఫైర్

కలం, మెదక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే కొంత మంది అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) మండి పడ్డారు. మెదక్ కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలులో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా అధికారులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారని ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ లు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని సంబంధిత అధికారులపై ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడం కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తో కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు.

మెదక్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు (Raghunandan Rao) అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎంపీ సూచించారు.

Also Read : 60 శాతం మంది ఓటర్లకు నోటీసులు: సుదర్శన్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>