వయోవృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : సుధారాణి

కలం, వనపర్తి: వయోవృద్ధుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా సంక్షేమ అధికారి కే. సుధారాణి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వనపర్తి (Wanaparthy) లోని శ్రీ చౌడేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సమన్వయంతో నిర్వహించిన శిబిరంలో వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వారికి వైద్య సలహాలు, మందులు అందించారు.

ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి తగిన వైద్యసేవలు అందించాలని సుధారాణి సూచించారు. వృద్ధులను గౌరవం, ఆదరణతో చూసుకోవడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు శిబిరంలో పాల్గొని వృద్ధులకు సేవలు అందించారు. అనంతరం వయోవృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ, సేవాభావంతో వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ సిటిజన్‌ కమిటీ సభ్యులు, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ సిబ్బంది, పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.

Also Read: గోదావరిలో వరద ఉన్నా ఖాళీగా రిజర్వాయర్లు: హరీశ్ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>