రిమ్స్‌లో అత్యవసర మరమ్మతులకు కలెక్టర్ ఆదేశం

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్‌లో (Adilabad RIMS) అత్యవసర మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్‌లో తలుపులు, కిటికీలు, టాయిలెట్లు, ఆక్సిజన్ పైప్‌లైన్లు, జనరేటర్లు, లిఫ్ట్, రోడ్లు, కాంపౌండ్ వాల్ తదితర అత్యవసర పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చేపట్టాలని సూచించారు. మంజూరైన రూ.11.10 కోట్ల అత్యవసర నిధులతో విద్యుద్దీకరణ, రోడ్లు, భవన సముదాయాలు, మౌలిక వసతులు, శానిటేషన్‌కు సంబంధించిన మరమ్మతు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ప్రతి పనికి తప్పనిసరిగా వారంటీ, ఏఎంసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిటికల్ కేర్ బ్లాక్ పనులను కేవలం 15 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, టెండర్లలో జాప్యం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. అవుట్‌పేషెంట్, ప్రెగ్నెంట్ బ్లాక్‌ల మధ్య రోగుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పనుల కేటాయింపులో ఎలాంటి సిఫార్సులు, పక్షపాత ధోరణులకు తావివ్వకుండా పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, రిమ్స్ (Adilabad RIMS) డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీపీఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పంచాయతీరాజ్ ఈఈ శివరామ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Also Read: ఉద్యోగుల డిమాండ్లకు సర్కార్ సానుకూల హామీలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>