భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: పీఓడబ్ల్యూ, టీయూసీఐ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి (Bhagat Singh Jayanti)వేడుకలను శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ), ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పోషించిన పాత్రను కొనియాడారు.

చిన్న వయస్సులోనే దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. భగత్ సింగ్ కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, సమాజంలోని అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఆలోచించిన యువ విప్లవకారుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న, లక్ష్మి, గంగామణి, విజయ, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: గోదావరిలో వరద ఉన్నా ఖాళీగా రిజర్వాయర్లు: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>