కలం, సోన్ : గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో (Kadthal) ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన (Ganesh Immersion) వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో నిర్వహించిన ఉట్టి కొట్టే (జారుడు గుంజ) కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జారుడు గుంజ ఎక్కి ఉట్టి కొట్టేందుకు యువకులు ఉత్సాహంగా పోటీపడ్డారు.
హల్చల్ యూత్, రాక్ స్టార్ యూత్ సభ్యులు పోటాపోటీగా పాల్గొని ఉట్టికొట్టారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. యువకుల ఉత్సాహభరిత పోటీని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తిగా తిలకించారు. అనంతరం హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద వీడీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము, వీడీసీ కోశాధికారి రవి, వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also Read : గోదావరిలో వరద ఉన్నా ఖాళీగా రిజర్వాయర్లు: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

