ప్రతి ఒక్కరూ వందేమాతరం గేయాన్ని పాడాలి : రామారావు పటేల్

కలం, భైంసా : దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వందేమాతరం గేయాన్ని పాడాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Ramarao Patel) అన్నారు. శుక్రవారం భైంసా పట్టణంలో విద్యాభారతి, అఖిల భారతీయ శిక్షా సంస్థాన్, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ‘నమామి భారతం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వందేమాతరం సామూహిక గాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బంకిమ్ చంద్ర చటర్జీని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశభక్తి భావాన్ని చాటే వందేమాతరం గేయానికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీలో వందేమాతరం గానం చేస్తున్న సమయంలో కొందరు పాడకపోవడం సరికాదని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వందేమాతరాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్, మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, వివిధ విభాగాల ప్రముఖులు సరికొండ దామోదర్, కృష్ణదాస్, గంగాధర్ గౌడ్, శ్రీధర్, పురస్తు గోపాల్ కిషన్, పెండపు కాశీనాథ్, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>