కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.1.01 కోట్లకు గణేశ్ లడ్డు వేలం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని ప్రసిద్ధ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ (Keerthi Richmond Villas) గేటెడ్ కమ్యూనిటీలో గణేశ్ లడ్డు వేలం పాట మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన ఈ వేలం కార్యక్రమంలో 5 కిలోల బరువున్న వినాయకుని ప్రసాదం లడ్డు రూ.1.01 కోట్ల భారీ ధరకు వేలంలో అమ్ముడైంది.

ఈ కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృంద సభ్యులు పోటీపడి మరీ ఈ లడ్డును సొంతం చేసుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో గణేశ్ లడ్డు రూ.2.31 కోట్ల రికార్డు ధర పలకగా, ఈసారి కూడా కోటి రూపాయల మార్కును దాటి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడ సేకరించిన నిధులను ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు, నిరుపేదల సహాయార్థం ఉపయోగిస్తారు. వేలం ప్రక్రియ ముగిసిన అనంతరం బుధవారం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>