నిర్మల్ గణేష్ నిమజ్జనోత్సవానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవానికి (Ganesh Immersion) హాజరు కావాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) ని ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి నిమజ్జనోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులకు సూచించాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>