epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజాసాబ్ ర‌న్‌టైంపై మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

కలం వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “రాజాసాబ్ష‌(Raja Saab). టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruthi) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ హారర్ అండ్ కామిడీ మూవీ ఈ నెల 9న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్డి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాజాసాబ్ ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ఈ చిత్రం తెలుగు,హిందీ ,తమిళ్ ,కన్నడ ,మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తి అయింది. సెన్సార్ బోర్డ్ రాజాసాబ్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా స‌మాచారం. ఈ సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలు.. అంటే, మూడు గంటల మూడు నిమిషాలు. అయితే రన్ టైమ్ గురించి భిన్నాభిప్రాయలు వస్తుండటంతో ఈ విషయంపై దర్శకుడు మారుతీ మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం నిడివి నాలుగు గంటలు వచ్చింది. స్టార్ హీరోల సినిమాల విషయంలో కొన్ని ఎక్కువ షాట్స్ తీస్తాం. అందువల్ల ఎక్కువ రన్ టైమ్ వస్తుంది. నాలుగు గంటల సినిమాని మూడు గంటలు వచ్చేలా కట్ చేసి ఫైనల్ వెర్షన్ సిద్దం చేశామని తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>