హనుమకొండలో ఉద్రిక్తత.. తల్లి, కుమార్తెను ఇంట్లోనే బంధించారని ఆరోపణ!

కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda) నయీంనగర్‌లో ఓ ఇంటి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జయశ్రీ, తేజశ్రీ అనే తల్లి, కుమార్తెలను వారి బంధువులు మూడు రోజులుగా ఇంట్లోనే తాళం వేసి ఉంచారంటూ స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. ఇంటి సమస్యను పరిష్కరించుకునేందుకు పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని బాధితుల తరఫు బంధువులు ఆరోపించారు.

జయశ్రీ, తేజశ్రీలను అత్త గూడూరు మిరాబాయి ఇంట్లో నిర్బంధించినట్లు స్థానిక మహిళలు ఆరోపిస్తూ.. వారిద్దరూ క్షేమంగా ఉన్నారా? అనే ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ఇంటికి తాళం వేసి, కనీసం తిండి కూడా అందకుండా ఉంచారని వారు పేర్కొన్నారు. వెంటనే ఇంటి తాళం తీయించి జయశ్రీ, తేజశ్రీలకు రక్షణ కల్పించాలని కార్తికేయతో పాటు స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. ఇంటి సమస్యపై తల్లి, కుమార్తెను వేధిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని బాధితుల తరఫు వారు ఆరోపించారు.

Also Read : దానం నాగేందర్ కు సుప్రీం కోర్టు షాక్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>