కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ (Kakumanu Rajasekhar) గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
రాజశేఖర్ భౌతికకాయాన్ని అభిమానులు, పార్టీ నాయకుల సందర్శనార్థం ఎల్బీనగర్‌లోని ఆయన నివాసంలోనే ఉంచారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఒంగోలుకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర సంతాపం తెలిపారు.

