మినీ ఖైరతాబాద్ గణపతి లడ్డూకు భారీ ధర

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో(Adarsh Nagar) స్టూడెంట్స్ గణేష్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మినీ ఖైరతాబాద్ బొజ్జ గణపయ్యకు (Mini Khairatabad Ganesh) భక్తిశ్రద్ధలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణపతి ఆకారంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గణపతి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదం వేలంపాటను ఉత్సాహంగా నిర్వహించారు. కాలనీకి చెందిన ముల్లె రాజేందర్ రూ.1,08,000లకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆదర్శనగర్‌లో సందడి నెలకొంది. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : వర్ష బీభత్సానికి కూలిన రాజుపేట బ్రిడ్జి..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>