పేకాట ఆడుతూ దొరికిపోయిన మాజీ ఎమ్మెల్సీ

కలం, మెదక్ బ్యూరో: మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి (Kura Raghotham Reddy) పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. సిద్దిపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన నివాసంలోనే పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాడి చేసిన పోలీసులు రఘోత్తం రెడ్డితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకుని, నిందితులను సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. గతంలో టీచర్స్ ఎమ్మెల్సీగా ఎంతో బాధ్యతాయుతమైన పదవి నిర్వర్తించిన వ్యక్తి ఇంట్లో పేకాట స్థావరం బయటపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>