విశాఖ స్టీల్ ప్లాంట్‌లో న‌కిలీ గ్యాంగ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant)లో న‌కిలీ ఐడీ కార్డులో చోరీల‌కు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే… ఏడుగురు స‌భ్యులున్న ముఠా స్టీల్ ప్లాంట్‌లో ప‌ని చేస్తున్న కొంద‌రు ఉద్యోగుల ఉద్యోగుల ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి, సీఐఎస్ఎఫ్ నకిలీ స్టాంపులతో ఫేక్ కార్డులు తయారు చేశారు. ఆ కార్డుల‌తో రోజూ స్టీల్ ప్లాంట్‌లోకి వ‌స్తూ కాప‌ర్‌, స్టీల్ చోరీ చేస్తున్నారు. ఈ విధంగా సుమారు 300 కేజీల కాప‌ర్‌ను దొంగిలించారు. కాప‌ర్ చోరీపై స్టీల్ ప్లాంట్ సిబ్బంది గాజువాక క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

సిబ్బంది ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాప‌ర్ చోరీకి పాల్ప‌డ్డ ఏడుగురు న‌కిలీ ఉద్యోగుల‌ను అరెస్ట్ చేశారు. వీరి ద‌గ్గ‌ర నుంచి 300 కేజీల కాపర్, 5 నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీ కార్డుల‌తో పాటు, రెండు బైక్‌లు సీజ్ చేశారు. వేగంగా కేసును ఛేదించిన గాజువాక క్రైమ్ పోలీసుల‌ను ఏసీపీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>