కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ రమేశ్ (Rathod Ramesh) ను జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిపాలనలో ఆయన సేవలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు రాహుల్ రాజ్, వినోద్ కుమార్, ఉదయ్ కుమార్, సచిన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

