కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 రగ్బీ (Under-14 Rugby) బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 100 మంది బాలికలు, 120 మంది బాలురు పోటీలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ రాథోడ్ లక్ష్మణ్ తెలిపారు. జోనల్ స్థాయి పోటీలను అక్టోబర్ చివరిలో నిర్మల్ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు రమణారావు, టీజీపీఏ కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, జాయింట్ సెక్రటరీ పోశెట్టి, సంజీవ్, హన్మండ్లు, ముఖేష్, ఆర్గనైజర్ భూమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమలత, గిరి తదితరులు పాల్గొన్నారు.

