కలం, వెబ్ డెస్క్: ‘కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖతమే‘ అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. పార్టీని మోసం చేసి అవినీతికి పాల్పడ్డ హరీశ్ రావుకు (Harish Rao) బాధ్యతలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. హరీశ్‌రావు ట్రుబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అసెంబ్లీ బాధ్యతలు పిల్లకాకులకు అప్పగించొందంటూ కామెంట్ చేశారు. శుక్రవారం ఆమె చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేసీఆర్ (KCR) వెంటనే అసెంబ్లీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని కవిత సూచించారు. పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడిన హరీశ్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న వ్యక్తి హరీశ్ రావు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ లో జాగృతి ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం జూరాల నుంచి మార్చి చారిత్రిక తప్పిదం చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కవిత (Kavitha) వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
రేవంత్ రెడ్డిని ఉరి తీయాలి: కవిత
సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కవిత వెల్లడించారు. నాలుగు నెలలుగా తన రాజీనామాను ఆమోదించడం లేదని చెప్పారు. ఇప్పుడు కౌన్సిల్ నడుస్తోందని, తన రాజీనామా ఆమోదించే ముందు సభలో తనకు మాట్లాడే అనుమతి ఇవ్వాలని ఛైర్మన్‌ను అడగనున్నట్లు కవిత తెలిపారు. సభలో మాట్లాడిన తర్వాత రాజీనామా ఆమోదింపజేసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకులను పట్టుకొని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆమోదయోగ్యం కాదన్నారు. కేసీఆర్‌ను ఉరి తీయాని రేవంత్ అంటున్నారని, రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలని కవిత వ్యాఖ్యానించారు.
పాలమూరుకు రేవంత్ అన్యాయం
పాలమూరుకు రేవంత్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి ఛాంబర్‌లో హరీశ్ రావు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసునన్నారు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్‌కు నష్టమేనని కవిత అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరికపై స్పందిస్తూ.. తనకు బీఆర్ఎస్‌పై మనసు విరిగిందని, కేసీఆర్ పిలిచినా మళ్లీ పార్టీలోకి వెళ్లేది లేదని చెప్పారు. తాను మొదటి నుంచే స్వతంత్రంగా పని చేసినట్లు కవిత తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావులు కేసీఆర్ డైరెక్షన్‌లోనే పని చేస్తూ వచ్చారని చెప్పారు. తాను జాగృతి జెండాతో ముందుకు వెళ్ళాను.. తెలంగాణ కు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తాం. జాగృతి జనంబాటలో ప్రజల కష్టాలను కళ్ళారా చూస్తున్న.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొత్త ఒక్క కరెంట్ ఫోల్ కూడా తండాలకు ఇవ్వడం లేదు.. మిషన్ భగీరథ ను ఆగం చేశారు. తాగునీటి కోసం ప్రజలు, గిరిజనులు తండ్లాడుతున్నారు
Read Also: అసెంబ్లీలో మూసీపై చర్చ.. హరీశ్ సవాల్‌కు శ్రీధర్ బాబు రియాక్షన్
Follow Us On : WhatsApp


