కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం (Ambedkar Bhavan) లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 లక్షల నిధులు మంజూరు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కుచాడి శ్రీహరి రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి అంబేద్కర్ భవనం పరిస్థితులను వివరించి వినతిపత్రం అందజేశారు.
భవనం (Ambedkar Bhavan) లోపల ధ్వని ప్రతిధ్వని నివారణ చర్యలు చేపట్టడంతో పాటు అతిథుల సౌకర్యార్థం కుర్చీలు, ఇతర అవసరమైన వసతులు కల్పించాలని కోరారు. అలాగే అంబేద్కర్ భవనంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు కొంతం మురళీధర్, మధుకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఏపీలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి
Follow Us On: Instagram

