కలం, స్పోర్ట్స్ : భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) ఆసియా గేమ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. జపాన్‌లోని ఐచి-నాగోయా (Aichi-Nagoya) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆమె రజత పతకం సాధించారు. బుధవారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఇది ఆసియా గేమ్స్‌లో ఆమెకు లభించిన తొలి పతకం కావడం విశేషం. ఈ పోటీలో మీరాబాయి చాను (Mirabai Chanu) మొత్తం 198 కేజీల బరువును ఎత్తారు. స్నాచ్ విభాగంలో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 111 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. ఈ పోటీలో ఉత్తర కొరియాకు చెందిన రీసాంగ్ గుమ్ మొత్తం 215 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం గెలుచుకున్నారు.
ఇండోనేషియాకు చెందిన విజయానా లులుక్ డయానాత్రి 191 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుపొందారు. పట్టుదలతో సాధించిన పతకం2023 హాంజౌ ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చాను తీవ్రంగా శ్రమించారు. అయితే గాయం కారణంగా అప్పట్లో పతక అవకాశాన్ని తృటిలో కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ నిరాశను అధిగమించి, ఈసారి అత్యుత్తమ ప్రతిభతో రజతాన్ని (Silver Medal) ముద్దాడారు.
2021 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆమె రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మీరాబాయి సాధించిన ఘనతలు మీరాబాయి చాను క్రీడారంగంలో ఎన్నో మైలురాళ్లను దాటారు. 2017 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పసిడి పతకం సాధించారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2018లో పద్మశ్రీ, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాలతో సత్కరించింది.
Also Read : హీరో నాని ట్వీట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

