కలం, కరీంనగర్ బ్యూరో : హుస్నాబాద్ నియోజకవర్గంలో (Husnabad Constituency) రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో సుఖినె రాధమ్మ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, రాధమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
అదేవిధంగా దామెర గ్రామంలో ఇటీవల మృతి చెందిన కదం నాగయ్య చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

